క్యాంపు కార్యాలయంలోకి సిఎం ప్రవేశం

రోశయ్య క్యాంపు కార్యాలయంలోకి ప్రవేశించిన సందర్భంలో ఆయన వెంట కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి, ప్రభుత్వ భద్రతా సలహాదారు కెవిపి రామచందర్ రావు, మంత్రులు గల్లా అరుణ తదితురులు ఉన్నారు. రోశయ్య కోసం క్యాంపు కార్యాలయంలో స్వల్ప మార్పులు జరిగాయి. పై అంతస్థులకు వెళ్లడానికి లిఫ్ట్ ఏర్పాటు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తూర్పు దిక్కు ముఖం చేసి కూర్చునేవారు. అయితే రోశయ్య దక్షిణం వైపు ముఖం చేసి కూర్చునేలా ఏర్పాటు చేశారు. వాస్తును తెలిపే టాంగ్ చేపల ఆక్వేరియాన్ని ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications