హైదరాబాద్: కర్నాటక రాజధాని బెంగళూర్ లో జరిగిన పేలుడులో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. పారిశ్రామిక గెలిటిన్ స్టిక్స్ వల్ల ఈ పేలుడు సంభవించింది. ద్విచక్రవాహనంపై తీసుకుని వెళ్లి దించుతుండగా గిలెటిన్ స్టిక్స్ పేలాయి. వాటిని దించే పనిలో మునిగి ఉన్న ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఇది ప్రమాదవశాత్తు సంభవించిన పేలుడు మాత్రమేనని, మృతులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెప్పారు. పారిశ్రామిక అవసరాలకు ఆ గిలిటెన్ స్టిక్స్ ను ఉద్దేశించారు.