రోశయ్యకు చేత కాదు: చంద్రబాబు

Chandrababu Naidu
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె రోశయ్యకు పరిపాలన చేత కాదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. చేతనైతే పాలన సాగించాలి, లేదంటే తప్పుకోవాలని ఆయన రోశయ్యనుద్దేశించి అన్నారు. సభను నడపడం కూడా రోశయ్యకు చేత కావడం లేదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఏదో సాకుతో సభను అర్థాంతరంగా వాయిదా వేసుకుని వెళ్లడం అలవాటుగా మారిందని ఆయన అన్నారు. స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి సభ్యతతో వ్యవహరించాలని ఆయన సూచించారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పద్ధతి మార్చుకోవాలని ఆయన అన్నారు.

సభను నాలుగైదు రోజులు పొడిగించి చేతనైతే ప్రజా సమస్యలపై చర్చించాలని ఆయన రోశయ్యకు సవాల్ విసిరారు. సభ నడవకుండా అధికార పక్షం చవకబారు విధానాలను అవలంబిస్తోందని ఆయన విమర్శించారు. సభను నడపడం చేత కాక రోశయ్య ప్రతిపక్షాలు విఫలమయ్యాయని ఎదురు దాడి చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంగా తాము ఇంత కన్నా ఏం చేయలేమని ఆయన అన్నారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా అధికార పక్షం చవకబారుగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. అధికార పక్షం సభ్యులు సభలో కుర్ర చేష్టలకు దిగుతున్నారని ఆయన అన్నారు.

వైయస్ హయాంలో సభ ఇంతకన్నా హుందాగా నడిచేదని ఆయన అన్నారు. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య హోరాహోరీ పోరు నడిచేదని ఆయన అన్నారు. గాలి జనార్జన్ రెడ్డికి చెందిన ఒఎంసి అక్రమాలను ఎండగట్టడంలో తాము విజయం సాధించామని ఆయన అన్నారు. రాష్ట్రంలో పరిస్థితి ఎమర్జెన్సీని తలపిస్తోందని ఆయన అన్నారు. మీడియాపై ఆంక్షలు విధించడాన్ని ఆయన తప్పు పట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+