'తెలంగాణ బస్సు' కోసం ఓరుగల్లు నిరీక్షణం

Warangal
వరంగల్‌: తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమ బస్సుయాత్ర మంగళవారం జిల్లాకు చేరుకోనుంది. ఉదయం మహబూబాబాద్‌లో ప్రవేశించే యాత్ర సాయంత్రం నగరానికి చేరుకుంటుంది. యాత్ర సాగే ప్రధాన రహదారుల వద్ద అక్కడక్కడ ఘన స్వాగతం పలికేందుకు జేఏసీలు సన్నాహాలు చేస్తున్నాయి.

నగరంలో యాత్ర ప్రవేశించినప్పటి నుంచి ముగిసే వరకూ అన్ని వర్గాల ప్రజలు ఆహ్వానం పలికేలా కార్యక్రమాలు రూపొందించారు. నగరంలో యాత్ర లేబర్‌కాలనీ నుంచి అమరవీరుల స్థూపం వరకు సాగుతుంది. ప్రధాన సెంటర్ల వద్ద ఉద్యమ నేతలు ప్రసంగిస్తారు. జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌, వైస్‌చైర్మన్‌ మల్లెపల్లి లక్ష్మయ్య, కన్వీనర్‌ స్వామిగౌడ్‌, విఠల్‌, శ్రీనివాస్‌గౌడ్‌, వెంకటస్వామి పాల్గొంటారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+