వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లికి ముందు సెక్స్ తప్పు కాదు: సుప్రీం

By Pratap
|
Google Oneindia TeluguNews

Kushboo
న్యూఢిల్లీ: పెళ్లి చేసుకోకుండా సహజీవనం, పెళ్లికి ముందే శృంగారంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వీటిని నేరాలుగా పరిగణించలేమని స్పష్టం చేసింది. అనైతికమని అనుకునే చర్యలపై నేర ముద్ర వేయడం తగదని సూచించింది. "ఇద్దరు వయోజనులు పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించడంలో తప్పేముంది? సహజీవనం నేరమా? ఎంతమాత్రం కాదు" అని ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్, జస్టిస్ దీపక్ వర్మ, జస్టిస్ ఎస్‌బీ చౌహాన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ద్వా పర యుగంలో రాధా కృష్ణులు సహజీవనం చేసినట్లు పురాణగాథలు చెబుతున్నాయని కోర్టు గుర్తు చేసింది. పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొనడం తప్పుకాదని 2005లో తమిళ నటి ఖుష్బూ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. తన అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పిన ఖుష్బూపై తమిళనాడులో 22 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీటిని కొట్టివేయాల్సిందిగా ఖుష్బూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ సందర్భంగా మంగళవారం సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

సహ జీవనమనేది జీవించే హక్కులో భాగమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రాథమిక హక్కులను కల్పించిన 21వ అధికరణను గుర్తు చేసింది. ఖుష్బూ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని తెలిపింది. "ఆమె అభిప్రాయాలు ఆమె చెప్పారు. మధ్యలో మీకొచ్చిన సమస్యేమిటి? మా కైతే ఏ బాధా లేదు. అది ఎలా నేరం? ఏ చట్టం కింద నేరం? ద యచేసి చెప్పండి!' అంటూ ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. ఖుష్బూ వ్యాఖ్యలు యువతను పెడదోవ పట్టించేలా ఉన్నాయనే వాదనలను కూడా ధర్మాసనం తోసిపుచ్చింది. "ఖుష్బూ ఆ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత అమ్మాయిలెవరైనా ఇళ్లలోంచి లేచిపోయారా? ఇందుకు ఆధారాలు చూపించగలరా? ఆమె వ్యాఖ్యలు ఎన్ని కుటుంబాలపై ప్రభావం చూపించాయో చెప్పగలరా ?" అని న్యాయవాదిని నిలదీసింది. 'మీకు కుమార్తెలు ఉన్నారా?' అని ప్రశ్నించింది. న్యాయవాది 'లేరు' అని బదులిచ్చారు. ఆ వెంటనే - 'మరి ఖుష్బూ ఇంటర్వ్యూ మీపై ఎలాంటి దుష్ప్రభావం చూపినట్లు?' అని న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ కేసులో విచారణను ముగించి, తీర్పును వాయిదా వేసింది. కుష్బూ కూడా కోర్టు హాజరయ్యారు. అందరి కళ్లు ఆమెపైనే నిలిచారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X