చాప్రా: బీహార్ లోని సరన్ జిల్లా బేల్బీలో నిర్మాణంలో పోలీసు భవనాన్ని సాయుధ మావోయిస్టులు పేల్చేశారు. జాజారు 50 మంది నక్సలైట్లు గత రాత్రి 11 గంటల 45 నిమిషాల ప్రాంతంలో భవంతిని చుట్టుముట్టి డైనమైట్ ను పేల్చడంతో పాటు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. దాంతో భవనం కూలిపోయింది.
భేల్బీ పోలీసు స్టేషన్ ను నిర్మాణంలో ఉన్న భవనంలోకి మార్చాలని నిర్ణయించారు. ఈ ఘటనలో ఏ విధమైన ప్రాణహాని సంభవించలేదని పోలీసులు చెప్పారు.