హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ కూరగాయల మార్కెట్లో ఓ ఉన్మాది ముగ్గురిపై దాడి చేశాడు. ఈ దాడిలో ఇద్దరు మరణించారు. మరో వ్యక్తి గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింసారు. పోలీసులు సంఘటనకు సంబంధించిన వివరాలు సేకరించి దర్యాప్తు జరుపుతున్నారు.