అసెంబ్లీలో బూతులు, తిట్లే: జెపి

అన్ని వసతులతో ప్రభుత్వం రాష్ట్ర వ్యా ప్తంగా 400 ఆస్పత్రులను నిర్మిస్తే ఒక్కోదానికి రూ. 2 కోట్ల చొప్పున 800 కోట్లు ఖర్చవుతుందని, 2 కోట్ల మంది ఔట్ పేషంట్లకు, 15 లక్షల మంది ఇన్‌పేషెంట్లకు ఉచితంగా వైద్యం అందించవచ్చన్నారు. కాగా, విద్యుత్తు లేక పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించామంటే మనం అభివృద్ధి చెందుతున్నట్లా, నాశనమవుతున్నట్లా అని జేపీ ప్రశ్నించారు. ప్రభుత్వం విద్యుత్తు ఇవ్వకపోవడం వల్ల 22 చిన్న పరిశ్రమల సమాఖ్యలు నిరాహారదీక్షకు కూర్చున్నాయన్నారు. వీటికి 250 మెగావాట్లే ఇవ్వలేని ప్రభుత్వం ఐదువేల మెగావాట్లతో ఎత్తిపోతల పథకాలు ఎలా నడుపుతుందని జేపీ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications