తెరాస అపోహలు కలిగిస్తోంది: లగడపాటి

Lagadapati Rajagopal
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన సమయంలో చేసుకున్న పెద్ద మనుషుల ఒప్పందంలో ఉల్లంఘనలేవీ జరగలేదని విజయవాడ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. దీనిపై శ్రీకృష్ణ కమిటీకి గురువారం ఒక నివేదిక సమర్పించానని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు ప్రజల్లో అనేక అపోహలు, అభూత కల్పనలు కలిగిస్తున్నందున ఏది నిజం-ఏది అబద్ధం అనేది తెలుసుకునేందుకు నివేదిక సమర్పించానని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైనప్పుడు హైదరాబాద్ పరిధిలో ఉన్న 8 జిల్లాలు ఆంధ్రప్రదేశ్‌లో కలవగా, 5 జిల్లాలు మహరాష్ట్రలో, 3 కర్ణాటకలో కలిశాయని చెప్పారు.

పెద్ద మనుషుల ఒప్పందం కూడా ఐదేళ్ల వరకేనని, ఆ తరువాత పునఃసమీక్షకు మరో ఐదేళ్లు గడువిచ్చారని తెలిపారు. తెలంగాణకు నిధులు ఖర్చు చేయకపోవడం అన్నది కూడా పూర్తి వాస్తవం కాదని పేర్కొన్నారు. 1969లో మాత్రమే తెలంగాణకు కేటాయించిన నిధుల్లో రూ.28 కోట్లు ఖర్చు పెట్టలేదని భార్గవ కమిషన్ నివేదిక వెల్లడించిందని చెప్పారు. నీటి పారుదల కోసం ఇచ్చిన 610జీవోతో ఆంధ్ర, తెలంగాణలు సమానంగా నష్టపోయాయని చెప్పారు.

హైదరాబాద్‌ను ఆరో జోన్‌గా ప్రకటించడం అన్యాయమన్నారు. ఇటువంటి డిమాండ్లు దేశ వ్యాప్తంగా తలెత్తే ప్రమాదం ఉందన్నారు. అలాగే, హైదరాబాద్ శివార్లలో జనాభా వృద్ధి రేటు 3,200 శాతం (సుమారు 33 రెట్లు) పెరిగిందని, వారిలో సీమాంధ్రవాళ్లే ఎక్కువన్నారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో కూడా సీమాంధ్రకు అన్యాయం జరిగిందని, అక్కడ 12 అసెంబ్లీ స్థానాలు తగ్గగా, గ్రేటర్ హైదరాబాద్‌లో 11 పెరిగాయని లగడపాటి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+