తిరుపతి: తమిళనాడుకు చెందిన భక్తుడు శ్రీవారి పట్ల ఉదారత ప్రదర్శించాడు. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) అనంత స్వర్ణమయ ప్రాజెక్టుకు రంగరాజన్ అనే ఎన్నారై భక్తుడు 20 కిలోల బంగారం ప్రదానం చేశాడు. ఆయన టిటిడి చైర్మన్ ఆదికేశవులు నాయుడుకు శుక్రవారం ఆ బంగారాన్ని అందజేశాడు.
అనంత స్వర్ణమయ ప్రాజెక్టుకు ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ మాల్యా 18 ద్వారాలకు బంగారు తాపడం చేయిస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.