వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బోర్డర్ లో ఆర్కే, చుట్టుముడుతున్న పోలీసులు

By Santaram
|
Google Oneindia TeluguNews

Maoists
నర్సీపట్నం: ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దు (ఎవోబి) ఇప్పుడు పోలీసుల చక్రబంధంలో చిక్కుకుంది. ఒకప్పుడు రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా చేసిన రామకృష్ణ ప్రస్తుతం ఏఓబీకి ఇన్‌ చార్జిగా వ్యవహరిస్తున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. అలాగే నంబళ్ల కేశవరావు అలియాస్‌ గంగన్న ఇక్కడే ఉన్నారంటున్నారు. ఇదే విషయం శాఖమూరి ఎన్‌కౌంటర్లో బయటపడినట్టు తెలుస్తోంది. దీంతో పెద్ద ఎత్తున బీఎస్‌ ఎఫ్‌, కోబ్రా, ఏపీఎస్‌ పీ బలగాలు ఏజెన్సీని చుట్టుముడుతున్నాయి. బలిమెల తరువాత మొదటి సారిగా గ్రేహౌండ్స్‌ బలగాలు కూంబింగ్‌ జరుపుతున్నాయి. అటు విజయనగరంలో సరిహద్దుగా ఉన్న నారాయణపురం నుంచి కోరాపుట్‌ మీదుగా ఇటు ఈస్టు డివిజన్‌తో సరిహద్దుగా ఉన్న సీలేరు నుంచి మల్కనగిరి వరకు కూంబింగ్‌ ఉధృతంగా సాగుతోంది.

ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌లో భాగంగా ఛత్తీస్ ‌గఢ్ ‌లో మావోయిస్టులు ఏరివేత కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. అన్ని వైపుల నుంచి పోలీసులు అడవిలో గాలిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే మావోయిస్టులు చక్రబంధంలో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఇటు ఒరిస్సా నుంచి పోలీసులు రంగంలోకి దిగాయి. వీరికి తోడుగా సీఆర్‌పీఎఫ్‌ బలగాలు పనిచేస్తున్నాయి. నిత్యం సరిహద్దులో ఉండే బీఎస్‌ఎఫ్‌ బలగాలు ఏఓబీలో కూంబింగ్‌ జరుపుతున్నాయి. వీటికి తోడు గ్రేహౌండ్స్‌ బలగాలను మోహరించడంతో మావోయిస్టులపై ముప్పేట దాడి జరుగుతోంది. మరో వైపు గిరిజనులు బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X