న్యూఢిల్లీ: ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుసేన్ పై పెట్టిన ఉన్న క్రిమినల్ కేసులు ఎత్తేసి దేశానికి తిరిగి వచ్చే ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని (పిల్ ను) సుప్రీంకోర్టు శుక్రవారం డిస్మిస్ చేసింది. హిందూ దేవుళ్లను, దేవతలను కించపరుస్తూ చిత్రాలు గీశాడనే ఆరోపణలపై హుసేన్ మీద దేశవ్యాప్తంగా 95 కేసుల దాకా ఉన్నాయి. దాంతో ఆయన 2006 నుంచి దేశం వెలుపలే ఉంటున్నారు. ఇటీవల ఆయనకు ఖాతర్ పౌరసత్వం కూడా లభించింది.
హుసేన్ పై కేసులు ఎత్తేయాలని కోరుతూ జాతీయ సమగ్రతా మండలి సభ్యుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు భీమ్ సింగ్ పిల్ దాఖలు చేశారు. హుసేన్ ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన జరుగుతోందని ఆయన అన్నారు.