అసెంబ్లీ: రోశయ్య, బాబు వాగ్వాదం

రోడ్ల కాంట్రాక్టుల్లో లాలూచీ పడ్డారని, ఎక్కువ కోట్ చేశారని చంద్రబాబు అన్నారు. ఇందులో భాగంగానే ఛటర్జీ అనే అధికారిని బదిలీ చేశారని, ఓ ఇంజినీరును బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. దీనికి ముఖ్యమంత్రి కె రోశయ్య ప్రతిస్పందిస్తూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎన్ని ఆరోపణలు వచ్చాయి, ఎన్ని ఆరోపణల్లో స్పీకర్ వద్ద ఫైళ్లు పెట్టారో చెప్పాలని అన్నారు. పాలనలో లోపాలుంటే ఎత్తిచూపి ప్రతిపక్షంగా తెలుగుదేశం బాధ్యత నిర్వహించాలని ఆయన సూచించారు. తాము స్పీకర్ వద్ద ఫైళ్లు పెట్టిన సందర్భాలున్నాయని చంద్రబాబు జవాబిచ్చారు. కాంట్రాక్టుల్లో అవినీతికి పాల్పడడానికే ఛటర్జీని బదిలీ చేశారనే ఆరోపణల్లో నిజం లేదని ముఖ్యమంత్రి చెప్పారు. ఇంజినీరును ఎవరు బెదరిస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications