ఎర్త్ అవర్ లో దట్స్ తెలుగు డాట్ కాం సైతం...

నాలుగేళ్ళుగా ఈ కార్యక్రమం సాగుతోందని, 125 దేశాల్లోని వేలాది పట్టణాలు, నగరాలు ఇందులో పాలు పంచుకుంటున్నాయని నిర్వాహకులు చెప్పారు. ప్రంపచ ప్రఖ్యాత గ్రేట్ పిరమిడ్స్, ఈఫెల్ టవర్, ప్రాచీన చైనా నగరం లలో శనివారం కొంత సేపు విద్యుత్ ఉండదు. భూమాత అందిస్తున్న వనరులు అధిక వినియోగమవుతున్నాయని, వాటిని తగ్గించుకుని ప్రకృతి సమతౌల్యానికి పాల్పడాలన్న సందేశాన్ని ఈ ఎర్త్ అవర్ ఇస్తోంది.
కాలుష్యం పెరిగిపోవడం, ఆడవులు అంతరించిపోవడం, పర్యావరణ సమతుల్యత నశించడం వంటి కారణాల వల్ల భూమండలం వేడెక్కిపోతోంది. కాలుష్యం వల్ల ఓజోన్ పొర పలుచబడిపోతోంది. ఫలితంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. ఈసారి ప్రజల్లో ఎర్త్ అవర్ పై అవగాహన బాగా పెరిగిందని నిర్వాహకులు అంటున్నారు. రాజకీయ నాయకులు కలిసి రాకపోయినా ప్రజలు, సంస్ధలు స్వచ్చందంగా ఈ ప్రచార యాగంలో పాలు పంచుకుంటున్నాయని చెప్పారు.
భారతదేశంలోని అతి పెద్ద ప్రైవేటు బ్యాంకు అయిన ఐసిఐసిఐ ఎర్త్ అవర్ ను పాటిస్తోంది. రేపు శనివారం రాత్రి 8.30 నుంచి 9.30 వరకు బ్యాంకు శాఖల్లోను, ఎటిఎం లలోనూ పవర్ పవర్ ఆఫ్ చేస్తారు. అయితే ఎటిఎం లలో ఎమర్జెన్సీ లైటింగ్ ఉంటుంది. ఎటిఎంలు యధావిధిగా పనిచేస్తాయి. మిగతా వన్నీ స్విచ్ ఆఫ్ చేయబడతాయి. మల్టీ నేషనల్ బ్యాక్ హెచ్ ఎస్ బిసి కూడా ఇదే విధమైన నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications