కంపాలా/వాషింగ్టన్: ఉగాండ తిరుగుబాటు వర్గం 321మంది దేశ పౌరులను హతమార్చిందని మానవహక్కుల సంస్థ ఆదివారం తెలిపింది. గత ఏడాది డిసెంబర్‌లో చివరలో ఈశాన్య కాంగోలో ఆ గ్రూప్ జరిపిన హత్యాకాండలో వీరిని పొట్టనపెట్టుకున్నట్లు వెల్లడించింది.
అంతేకాకుండా 80మంది చిన్నారులతో సహా 250 మందిని రెసిస్టెన్స్ ఆర్మీ అపహరించిందని పేర్కొంది. మానవహక్కుల సంస్థ ప్రతినిథులు హత్యాకాండ జరిగిన ప్రాంతాల్లో సందర్శించి ఈ వివరాలను సేకరించారు.