అహ్మదాబాద్: ఏడు భారతీయ నౌకలను సోమాలియా సముద్ర దొంగలు హైజాక్ చేసినట్లు తెలిసింది. గల్ఫాఫ్ ఏడెన్‌లో గుజరాత్ రాష్ట్రానికి చెందిన నౌకలను అపహరించినట్లు సమాచారం. నరనారాయణ్, సీక్వీన్, ఒస్మానీ, కాదేరీ, అల్ ఎజాజ్, కళ్యాణ్, కృష్ణజ్యోత్ నౌకలు హైజాక్ అయ్యాయని అధికారులు గుర్తించారు. ఏడు భారతీయ నౌకల్లో 105 మంది నావికాదళ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. దొంగల చెర నుంచి వారిని రక్షించేందుకు నావికాదళ అధికారులు రంగంలోకి దిగారు.