హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్ఫ్యూ సడలింపు: వీధుల్లోకి ప్రజలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad Old City
హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలోని తొమ్మిది పోలీసు స్టేషన్ల పరిధిలోని ప్రాంతాల్లో తొలి విడత శనివారం కర్ఫ్యూ సడలింపు సమయంలో పెద్ద ప్రజలు వీధుల్లోకి వచ్చారు. కూరగాయలు, ఇతర నిత్యావసర సరకులు కొనుగోలు చేసుకోవపడానికి బారులు తీరారు. వృద్ధులను, మహిళలను మాత్రమే పోలీసులు అనుమతించారు. వీధుల్లో రావడానికి ప్రయత్నించిన యువకులపై పోలీసులు విరుచుకుపడ్డారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటలకు పాతబస్తీలోని బేగంబజార్, అఫ్జల్ గంజ్, ఆసిఫ్ నగర్, టప్పా చబుత్ర, కుల్సుంపుర, మంగళ్ హాట్, హబీబ్ నగర్, షాహినాయతే గంజ్ పోలీసు స్టేషన్ల పరిధిల్లో కర్ఫ్యూను సడలించారు.

ప్రభుత్వం 16 సంచార వాహనాల ద్వారా కూరగాయల విక్రయానికి ఏర్పాటు చేసింది. ఎటిఎం, మందుల షాపుల వద్ద ప్రజలు బారులు తీరారు. పోలీసు పహారా మధ్య పాతబస్తీ ప్రశాంతంగానే ఉంది. అవాంఛనీయ సంఘటనలేవీ జరగలేదు. కాగా, ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు చార్మినార్, హుస్సేనీ ఆలం, కామాటిపుర, బహదూర్ పురా, కాలాపత్తర్, మీర్ చౌక్, మొఘల్ పుర, రెయిన్ బజార్, డబీర్ పుర, ఫలక్ నుమా, ఛత్రినాక, శాలిబండ, చాంద్రాయణ గుట్ట, సంతోష్ నగర్, మాదన్నపేట, భవానీనగర్, కంచన్ బాగ్ పోలీసు స్టేషన్ల పరిధిల్లో కర్ఫ్యూను సడలిస్తారు.

రేపు ఆదివారం కర్ఫ్యూను పూర్తిగా సడలించే విషయాన్ని పరిశీలిస్తామని, ఈ రోజు నిర్ణయం తీసుకుంటామని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ చెప్పారు. మొత్తం 25 పోలీసు స్టేషన్ల పరిధిల్లో కర్ఫ్యూ విధించారు. ఈ 25 పోలీసు స్టేషన్లలో శనివారం కొంత సేపు కర్ఫ్యూను సడలించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X