గ్రీన్ హంట్ వల్లనే ఈ దాడి: గద్దర్

కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానం వల్లనే అమాయకులైన జవాన్లు ప్రాణాలు కోల్పోయారని, విధులు నిర్వహిస్తున్న పేద జవాన్లు చిదంబరం విధానం వల్లనే బలయ్యారని ఆయన అన్నారు. ప్రజలే మావోయిస్టుల బలమని ఆయన అన్నారు. నక్సలైట్ సమస్యను సామాజిక కోణం నుంచి చూడకపోవడం వల్ల ఈ పరిస్థితి చోటు చేసుకుంటోందని ఆయన అన్నారు. మృతి చెందిన జవాన్లకు ఆయన తన సంతాపం ప్రకటించారు. వారి కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల మీద, అడవి మీద, అమాయకుల మీద యుద్ధం ప్రకటించిందని ఆయన విమర్శించారు.
తనపై 13 ఏళ్ల క్రితం దాడి జరిగిందని, తన శరీరంలోకి ఐదు బుల్లెట్లు దూసుకుపోయాయని, ఇప్పటి వరకు తనపై దాడి చేసిందెవరో ప్రభుత్వాలు తేల్చలేకపోయాయని ఆయన అన్నారు. తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనపై దాడి జరిగిందని, ఆ తర్వాత వైయస్ రాజశేఖర రెడ్డి వచ్చారని, ఇప్పుడు రోశయ్య ముఖ్యమంత్రి అయ్యారని, అయినా కేసు ముందుకు కదలలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications