హార్ముజ్ పై ట్రంప్ కీలక ప్రకటన..! ఇక ప్రపంచ దేశాలకు చుక్కలే..!

అమెరికా-ఇరాన్ మధ్య వార్ ముదురుతోంది. ఇప్పటికే కుదుర్చుకున్న శాంతి ఒప్పందాన్ని సైతం పక్కనబెట్టేసి దాడులు, ప్రతిదాడులకు దిగుతున్న ఇరుదేశాలూ గల్ఫ్ ను వేడెక్కించేస్తున్నాయి. ఈ తరుణంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) ఇవాళ మరో సంచలన వార్నింగ్ ఇచ్చారు. హార్ముజ్ జలసంధిపై అమెరికా నియంత్రణ సాధిస్తుందని, ఈ కీలకమైన జలమార్గాన్ని కాపాడినందుకు ప్రతిగా ఇతర దేశాలు తమకు కప్పం కట్టాలంటూ ట్రంప్ తేల్చిచెప్పేశారు.

ఇరాన్ దెబ్బకు విమానం మార్చేసిన ట్రంప్- ఏం జరిగిందంటే..?
ఇరాన్ దెబ్బకు విమానం మార్చేసిన ట్రంప్- ఏం జరిగిందంటే..?

తాజాగా ఫాక్స్ న్యూస్‌తో ఫోన్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ట్రంప్.. అమెరికా ఈ జలసంధికి సంరక్షకుడిగా మారుతుందని తెలిపారు. ఈ కీలకమైన జలమార్గంలో సముద్ర రవాణాను పరిరక్షించినందుకు పరిహారానికి అర్హమైనదని ట్రంప్ చెప్పుకొచ్చారు. తాము ఈ జలసంధిని ఆధీనంలోనే ఉంచుకుంటామని, బహుశా దానిని తామే నడుపుతామని, ఈ జలసంధికి సంరక్షకుడిగా మారతామని ట్రంప్ తెలిపారు. దీన్ని జలసంధి సంరక్షక దేవదూతగా పిలుస్తామని అందుకు తమకు పరిహారం చెల్లించాలని ట్రంప్ తెలిపారు.

Trump Says US Will Control Strait of Hormuz Seeks Reimbursement as Guardians
టర్కీకి షేక్ హ్యాండ్ ఇచ్చి భారత్, ఇజ్రాయెల్ కు షాకిచ్చిన ట్రంప్..!
టర్కీకి షేక్ హ్యాండ్ ఇచ్చి భారత్, ఇజ్రాయెల్ కు షాకిచ్చిన ట్రంప్..!

గల్ఫ్‌లో తిరిగి సైనిక ఘర్షణలు చెలరేగిన నేపథ్యంలో హార్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎవరిదనే విషయంపై అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్దం సాగుతోంది. ఈ తరుణంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. హార్ముజ్ పై తమకే అధికారం ఉందని ఇరాన్ పట్టుబడుతుండగా.. అంతర్జాతీయ నౌకాయాన హక్కుల కింద వాణిజ్య నౌకాయానానికి అనుమతి ఉందని అమెరికా వాదిస్తోంది. పర్షియన్ గల్ఫ్‌ను, ఒమన్ గల్ఫ్‌ను, అరేబియా సముద్రాన్ని కలిపే హార్ముజ్ పై పట్టు విషయంలో ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్దం ఇప్పుడు అంతర్జాతీయ చమురు సరఫరాలకు ఇబ్బందులు కలిగించబోతోంది. హార్ముజ్ లో నౌకాయానానికి ఏ మాత్రం అంతరాయం కలిగినా, ప్రపంచ ఇంధన ధరలు మరింత పెరగవచ్చని అంచనా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+