బందరు పోర్టుకు 'నవయుగం', హర్షం

టెండర్లు దక్కించుకున్న మేటాస్ సంస్థ ఆర్థికపరమైన చిక్కుల్లో పడడంతో పోర్టు వ్యవహారం వెనక్కి వెళ్లిందని కొన్ని రాజకీయపక్షాలు దుష్ప్రచారం చేశాయి. కొంతకాలం దీని నిర్మాణంపై సందిగ్ధత నెల కొంది. ఈ నేపథ్యంలో బందరు ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య చొరవ మేరకు వైఎస్ అప్పట్లోనే నవయుగ కంపెనీకి పనులు అప్పగించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆయన మరణానంతరం ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ ఆశయాన్ని కొనసాగించేందుకు నడుం కట్టింది. దీనికి సంబంధించి న్యాయపరమైన ఆటంకాలు తలెత్తకుండా అడ్వకేట్ జనరల్ నుంచి సలహాలు, సూచనలు తీసుకుంది. ఈ ప్రాజెక్టు సత్వర నిర్మాణం కోసం జిల్లా మంత్రి పార్ధసారధి తీవ్ర కృషి చేశారు.












Click it and Unblock the Notifications