కాకినాడ: ఎస్సీ వర్గీకరణ జరపాలంటూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) కార్యకర్తలు ముఖ్యమంత్రి రోశయ్య మాట్లాడుతున్న సభలో గందరగోళం సృష్టించారు. తూర్పు గోదావరి జిల్లాలో పర్యటనలో భాగంగా ఆదివారం మామిడికుదురులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.
రోశయ్య మాట్లాడుతుండగా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు అడ్డు తగిలారు. ఎస్సీ వర్గీకరణకు పట్టుబట్టారు. దీంతో సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను ముఖ్యమంత్రి కోరారు.