న్యూఢిల్లీ: సమైక్య రాష్ట్రానికి మద్దతు తెలుపుతూ సీపీఎం మంగళవారం ఢిల్లీలో శ్రీకృష్ణ కమిటీకి నివేదిక సమర్పించింది. నివేదికలు సమర్పించేందుకు గడువు ఈ నెల 10వ తేదీతోనే ముగిసినా, జాతీయపార్టీ అయిన సీపీఎం కొంత ఆలస్యంగా నివేదిక ఇచ్చినా స్వీకరించేందుకు తమకు అభ్యంతరం లేదని కమిటీ సభ్యులు తెలపటంతో పార్టీ ఎంపీ పెనుమల్లి మధు, వి. శ్రీనివాసరావు, ఎస్.వీరయ్యలు పార్టీ తరఫున నివేదికను సమర్పించారు.