ఎండలకు మండుతున్న హైదరాబాద్

తీవ్రమైన వడగాలులు వీస్తుండటంతో ప్రజలు ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టాలంటేనే హడలిపోతున్నారు. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 6 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. రాత్రి పూటా పరిస్థితేమీ భిన్నంగా లేదు. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే 3-4 డిగ్రీలు ఎక్కువే ఉంటున్నాయి. రెండు మూడు రోజుల్లో ఈ పరిస్థితిలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉందని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వాతావరణ సముద్ర అధ్యయన విభాగం ఆచార్యుడు ఒ.ఎస్.ఆర్.యు.భానుకుమార్ తెలిపారు. పసిఫిక్ మహా సముద్రం మీదుగా వీస్తున్న ఈశాన్య గాలుల ప్రభావం వల్ల ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికివచ్చే అవకాశం ఉందని ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications