తడాఖా చూపిన సలీమ్: అయినా టీమిండియా భారీ స్కోర్
ముల్లాన్‌పూర్ వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ లో భారత్ భారీ స్కోర్ సాధించింది. రెండో రోజు తన మొదటి ఇన్నింగ్స్‌ను 564/8 భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఆటలో ఆరంభం నుంచే దూకుడుగా వ్యవహరించిన టీమిండియా.. ప్రత్యర్థి బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. పటిష్ట స్థితిలో నిలిచింది. దీంతో ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ ను డ్రా చేసే దిశగా బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
షార్ట్ ఫార్మాట్ తరహాలోనే టెస్టుల్లోనూ వేగంగా ఆడాలన్న భారత టీమ్ మేనేజ్‌మెంట్ వ్యూహం ఈ మ్యాచ్‌లో అద్భుతంగా పనిచేసింది. ఉదయం సెషన్ నుంచి బ్యాటర్లు పరుగుల వరద పారించి, ప్రత్యర్థి జట్టును తీవ్రమైన మానసిక ఒత్తిడిలోకి నెట్టారు. 550 పరుగుల మార్కును దాటిన వెంటనే, అదనపు సమయాన్ని వృథా చేయకుండా వ్యూహాత్మకంగా ఇన్నింగ్ డిక్లేర్ ప్రకటించింది.

ఇన్నింగ్స్ చివరి దశలో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కీలక పాత్ర పోషించాడు. అత్యంత సంయమనంతో ఆడిన సుందర్, 53 పరుగులతో నాటౌట్‌గా నిలిచి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. టెయిల్ ఎండర్లతో కలిసి స్ట్రైక్ ను రొటేట్ చేస్తూ తనదైన షాట్లతో స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. బ్యాటింగ్ కు అనుకూలించిన పిచ్‌పై మంచి ఫుట్‌వర్క్ తో బౌలర్లకు చుక్కలు చూపాడు.
మరోవైపు, పేసర్ మహ్మద్ సిరాజ్ బ్యాటింగ్‌లో అనూహ్యంగా మెరుపులు మెరిపించాడు. నాలుగు ఫోర్లు, ఒక సిక్స్‌తో 22 పరుగులు చేశాడు. అతని కెరీర్‌లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. సలీమ్ సఫీ బౌలింగ్‌లో సిరాజ్ అవుట్ కావడంతో, 9వ వికెట్‌కు సాగిన 34 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.
ఆఫ్ఘనిస్థాన్ బౌలింగ్ విభాగంలో మహ్మద్ సలీమ్ సఫీ అదరగొట్టాడు. వికెట్ల వేట సాగించాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్నప్పటికీ, విసుగు చెందకుండా బౌలింగ్ చేసిన సఫీ 31 ఓవర్లలో 109 పరుగులు ఇచ్చి ఆరు కీలక వికెట్లు పడగొట్టారు. భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టిన అతను, డెబ్యూ ప్లేయర్ మానవ్ సుథార్ వికెట్‌ను కూడా తీసి తన పట్టుదలను చాటుకున్నారు.
మొత్తం 127 ఓవర్ల పాటు జరిగిన ఈ ఇన్నింగ్స్‌లో 564 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన భారత్.. ముల్లాన్‌పూర్ వేదికపై సరికొత్త రికార్డును నెలకొల్పింది. తొలి ఇన్నింగ్ లోనే మ్యాచ్ పై పట్టు బిగించింది. ఈ స్కోరు ఆఫ్ఘనిస్థాన్ అనానుభవజ్ఞులైన బ్యాటింగ్ లైనప్‌పై భారీ మానసిక ఒత్తిడిని పెంచనుంది. ఈ పిచ్‌పై భారత బౌలర్లు ఎలా రాణిస్తారనేది, మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపనుంది.












Click it and Unblock the Notifications