పొలిటికల్ ఎంట్రీ.. పార్టీ పై రాఘవ లారెన్స్ సంచలన ప్రకటన..!!
తమిళనాడు రాజకీయాల్లో వరుసగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విజయ్ తాజాగా జరిగిన ఎన్నికల్లో గెలిచిన రెండు స్థానాల్లో తిరుచ్చికి రాజీనామా చేసారు. అదే విధంగా విజయ్ కోసం మద్దతుగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన స్థానాల్లో ఉప ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. విజయ్ రాజీనామా చేసిన స్థానంలో రాఘవ లారెన్స్ పోటీ చేస్తారనే ప్రచారం పైన ఆయన స్పందించారు. స్పష్టత ఇచ్చారు.
తమిళ రాజకీయాల్లో మరో స్టార్ హీరో రాజకీయ రంగప్రవేశానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. డాన్సులతో, సినిమాలతోనే కాకుండా.. అనాథ పిల్లలను ఆదుకుంటూ, ఎంతో మందికి ఉచిత వైద్యం అందిస్తూ రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. తమిళనాడు లోని కీలకమైన 'తిరుచ్చి ఈస్ట్' అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సామాజిక సేవలో ముందు వరుసలో ఉన్న రాఘవ లారెన్స్ కు తిరుచ్చి సీటు ను టీవీకే నుంచి ఇవ్వాలని విజయ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఇప్పటికే లారెన్స్ తో పార్టీ ముఖ్య నేతలు చర్చించారు. అయితే, లారెన్స్ ఇంకా తుది నిర్ణయం చెప్పలేదు. ఈ సమయం లోనే లారెన్స్ చేసిన సోషల్ మీడియా పోస్టింగ్ వైరల్ అవుతోంది.

రాఘవ లారెస్స్ సంకేతాలు...
సీఎం విజయ్... లారెస్స్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో, లారెన్స్ కు ఎమ్మెల్యే గా అవకాశం ఇవ్వాలని విజయ్ భావిస్తున్నట్లు పార్టీ నేతల సమాచారం. ఈ సమయంలో సోషల్ మీడియా వేదికగా తన పొలిటికల్ ఎంట్రీ, తిరుచ్చి ఈస్ట్ పోటీపై వస్తున్న వార్తలపై రాఘవ లారెన్స్ స్పందించారు. ఆయన తన అఫీషియల్ ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేస్తూ.. 'నా రాజకీయ ప్రయాణం, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం గురించి సోషల్ మీడియాలో, పొలిటికల్ సర్కిల్స్‌లో రకరకాల వార్తలు వస్తున్నాయి. వీటన్నింటికీ సంబంధించి, నా భవిష్యత్తు కార్యాచరణపై ఈనెల 11వ తేదీన ఒక కీలక ప్రకటన చేయబోతున్నాను. నా అభిమానులు, ప్రజలు అప్పటివరకు వేచి చూడాలని కోరుతున్నాను' అని లారెన్స్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. దీంతో.. లారెన్స్ నిర్ణయం ఏంటనేది సినీ - పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తి కరంగా మారింది.













Click it and Unblock the Notifications