ఓటీటీని షేక్ చేస్తున్న టాప్- 5 సిరీస్‌లు ఇవే !

ఒకప్పుడు సినిమా చూడాలంటే వెండితెరపైనే ఆధారపడాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. నేటి యువత థియేటర్ల సీట్లలో కంటే బెడ్‌రూమ్‌లలో ల్యాప్‌టాప్, మొబైల్ స్క్రీన్‌ల ముందే ఎక్కువ సమయం గడుపుతున్నారు. దీనికి ప్రధాన కారణం.. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో లభిస్తున్న కంటెంట్ వైవిధ్యం, హద్దులు లేని బోల్డ్ కథనాలు. వెండితెరకు ఉండే సెన్సార్‌షిప్ సంకెళ్లు ఓటీటీకి లేకపోవడంతో.. డైరెక్టర్లు సైతం మానవ సంబంధాల వెనుక ఉండే డార్క్ రొమాన్స్, దాగి ఉన్న కోరికలు, ఎమోషన్లను వెండితెరపై చూపించలేనంత పచ్చిగా, ధైర్యంగా చూపిస్తున్నారు. ప్రస్తుతం ఓటీటీలను షేక్ చేస్తున్న టాప్-5 వెబ్ సిరీస్ ల గురించి తెలుసుకుందాం.

1. సేక్రేడ్ గేమ్స్ (నెట్‌ఫ్లిక్స్)..

భారతీయ ఓటీటీ హిస్టరీని మలుపు తిప్పిన సిరీస్ ఇది. సైఫ్ అలీ ఖాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్.. బోల్డ్‌నెస్ విషయంలో అప్పట్లో ఒక బెంచ్‌మార్క్ సెట్ చేసింది. ముఖ్యంగా గణేష్ గైతోండే (నవాజుద్దీన్), కుకు (కుబ్రా సైత్) మధ్య వచ్చే సీన్లు, రాజశ్రీ దేశ్‌పాండే బోల్డ్ యాక్టింగ్ అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించాయి. మితిమీరిన హింస, బూతులు, పచ్చిగా ఉండే శృంగార సన్నివేశాలతో కూడిన ఈ సిరీస్ మోస్ట్ డేంజరస్ అండ్ పవర్‌ఫుల్ ఇండియన్ సిరీస్‌లలో ఒకటిగా నిలిచింది.

here-are-the-top-5-series-shaking-up-the-ott-space-and-interesting-details-about-them-as-each-one

2. లస్ట్ స్టోరీస్ (నెట్‌ఫ్లిక్స్)

భారతీయ సమాజంలో ఇప్పటికీ క్లోజ్డ్ డోర్స్ వెనుక మాత్రమే మాట్లాడుకునే 'మహిళల శారీరక కోరికలు, వైవాహిక జీవితంలోని ఒంటరితనాన్ని' ఈ సిరీస్ బాహాటంగా చర్చించింది. కరణ్ జోహార్, అనురాగ్ కశ్యప్, జోయా అక్తర్, దిబాకర్ బానర్జీ లాంటి నలుగురు క్రేజీ డైరెక్టర్లు తెరకెక్కించిన ఈ ఆంథాలజీ సిరీస్ బోల్డ్ కంటెంట్‌కు కొత్త అర్థం చెప్పింది. కియారా అద్వానీ, విక్కీ కౌశల్, భూమి పెడ్నేకర్ నటించిన ఈ సిరీస్‌లోని కొన్ని సీన్లు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. దీనికి వచ్చిన క్రేజ్‌తోనే సీజన్-2 కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

3. ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్! (అమెజాన్ ప్రైమ్ వీడియో)
దీన్ని 'ఇండియన్ వెర్షన్ ఆఫ్ సెక్స్ అండ్ ది సిటీ' అని పిలుస్తారు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో స్వతంత్రంగా బతికే నలుగురు మోడ్రన్ అమ్మాయిల కథ ఇది. వారి కెరీర్, లవ్ లైఫ్, బ్రేకప్స్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సయానీ గుప్తా, కీర్తి కుల్హారి, బానీ జే, మాన్వీ గాగ్రూ నటించిన ఈ సిరీస్‌లో రొమాన్స్, బెడ్‌రూమ్ సీన్లు, బోల్డ్ డైలాగులు నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. నేటి తరం రిలేషన్‌షిప్స్ ఎంత త్వరగా బ్రేక్ అవుతున్నాయో ఇందులో నిష్కపటంగా చూపించారు.

4. మేడ్ ఇన్ హెవెన్ (అమెజాన్ ప్రైమ్ వీడియో)
జోయా అక్తర్, రీమా కగ్తీల సృష్టి అయిన ఈ సిరీస్.. ఢిల్లీలోని రిచ్ వెడ్డింగ్ ప్లానర్ల జీవితాల చుట్టూ తిరుగుతుంది. పైకి ఎంతో గ్రాండ్‌గా కనిపించే పెళ్లిళ్ల వెనుక ఉండే అక్రమ సంబంధాలు, స్వార్థాలు, వికృత చేష్టలను ఈ సిరీస్ అద్భుతంగా కళ్లకు కట్టింది. ఇది కేవలం శారీరక బోల్డ్‌నెస్‌కే పరిమితం కాకుండా.. సమాజంలోని కట్టుబాట్లను ప్రశ్నించే సైద్ధాంతిక ధైర్యంతో కూడిన బోల్డ్ కంటెంట్‌ను అందించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

5. షి - SHE (నెట్‌ఫ్లిక్స్)
ప్రముఖ దర్శకుడు ఇంతియాజ్ అలీ కలం నుంచి వచ్చిన అద్భుతమైన డార్క్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఒక పెద్ద డ్రగ్ మాఫియా ముఠాను పట్టుకోవడానికి సెక్స్ వర్కర్‌గా అండర్ కవర్ ఆపరేషన్ చేయాల్సి వచ్చిన ఒక సాధారణ ముంబై లేడీ కానిస్టేబుల్ భూమి (అదితి పోహంకర్) కథ ఇది. ఈ ప్రమాదకర ప్రయాణంలో ఆమె తన భయాన్ని దాటుకుని, తనలో దాగి ఉన్న లైంగిక శక్తిని, ఆధిపత్యాన్ని ఎలా తెలుసుకుందనేది చాలా బోల్డ్‌గా చూపించారు. అదితి పోహంకర్ ఒళ్లు గగుర్పొడిచే నటన, ఇందులోని రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులను స్క్రీన్‌కు కట్టేస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+