చంద్రబాబుతో నన్నపనేని రాజకుమారి భేటీ

Nannapaneni Rajakumari
హైదరాబాద్: పార్టీపై ఇటీవల గుంటూరులో తీవ్ర వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి బుధవారం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. తన వ్యాఖ్యలపై విచారణ జరపడానికి వేసిన ద్విసభ్య కమిటీ ముందు హాజరు కావడానికి ముందు ఆమె చంద్రబాబుతో సమావేశమయ్యారు. తాను ఏమీ చెప్పలేదని, చంద్రబాబు ఏమీ అనలేదని ఆమె భేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో అన్నారు. తన వ్యాఖ్యలపై ఆమె చంద్రబాబుకు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.

పార్టీలో పైరవీలు చేసేవారికే పదవులు దక్కుతున్నాయని, కష్టపడి పనిచేసే వారికి దక్కడం లేదని చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు ఆమె ద్విసభ్య కమిటీ ముందు హాజరయ్యారు. ఆమె వ్యాఖ్యలపై విచారణ జరపడానికి యనమల రామకృష్ణుడు, గరికపాటి రామ్మోహన్ రావులతో పార్టీ ఓ కమిటీని వేసింది. తన వ్యాఖ్యలపై కమిటీకీ ఆమె వివరణ ఇచ్చారు. తనపై విమర్శలు చేసిన తమ పార్టీ నాయకుడు తీగల కృష్ణారెడ్డిని కూడా కమిటీ ముందుకు పిలువాలని ఆమె కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+