చంద్రబాబుకు నన్నపనేని క్షమాపణలు

Nannapaneni Rajakumari
హైదరాబాద్: తాను చేసిన వ్యాఖ్యలకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి పార్టీకి, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు క్షమాపణలు చెప్పారు. ఆమె బుధవారంనాడు యనమల రామకృష్ణుడు, గరికపాటి రామ్మోహన్ రావులతో కూడిన ద్విసభ్య కమిటీ ముందు హాజరై తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తన వివరణతో చంద్రబాబు, ద్విసభ్య కమిటీ సభ్యులు సంతృప్తి చెందారని నన్నపనేని రాజకుమారి చెప్పారు. నన్నపనేని వివరణతో సంతృప్తి చెందామని, పార్టీ అంతర్గత వ్యవహారాలపై బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దని నన్నపనేనికి సూచించామని యనమల రామకృష్ణుడు, గరికపాటి రామ్మోహన్ రావు మీడియా ప్రతినిధులకు చెప్పారు.

తన వ్యాఖ్యల వల్ల వివాదమేదీ ఉత్పన్నం కాలేదని, ఏమైనా వివాదం ఉందనుకుంటే తీగల కృష్ణారెడ్డిని కూడా పిలిపించి మాట్లాడాలని చెప్పానని నన్నపనేని రాజకుమారి మీడియా ప్రతినిధులతో చెప్పారు. తన సమావేశం ప్రశాంతంగా ముగిసిందని, ఇప్పుడు ఆనందంగా ఉందని ఆమె అన్నారు. విషయాన్ని ఇంతటితో వదిలేద్దామని అనుకున్నట్లు ఆమె తెలిపారు. అందువల్ల ఆ సమస్య ఇంతటితో ముగిసినట్లేనని ఆమె అన్నారు. తన వివరణకు పార్టీ సానుకూలంగా ప్రతిస్పందించిందని ఆమె చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+