హైదరాబాద్: రాష్ట్రంలో ఖర్చు పెట్టిన నిధులపై తాను 1952 నుంచి లెక్కలు ఇవ్వాలని ఆర్థిక శాఖ అధికారులను అడిగానని, వారు లేవన్నారని శ్రీకృష్ణ కమిటీ సభ్యుడు అబూ సలే షరీఫ్ చెప్పారు. ఆర్థిక శాఖ నుంచి నివేదిక కోరేందుకు ఆయన శుక్రవారం వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. వారి నుంచి ఆయన వివరాలు సేకరించారు.
తమ వద్ద 1994 నుంచి మాత్రమే గణాంక వివరాలు ఉన్నాయని అధికారులు చెప్పినట్లు ఆయన తెలిపారు. అన్ని జిల్లాలకు సంబంధించిన వివరాలను తాను సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. అధికారులతో సమావేశం సంతృప్తిని ఇచ్చిందని ఆయన చెప్పారు.