భార్య, భర్త, పిల్లల దహనానికి యత్నం

తండ్రి ఆస్తిలో తనకు వాటా ఇవ్వకుం డా ఇద్దరు తమ్ముళ్లకు, అక్కకు ఇవ్వడంతో అప్పారావు గతంలో కేసు వేశాడు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి అప్పారావు, మంగారత్నం కుమార్తె రేణుక, కుమారుడు తరుణ్‌లతో కలిసి ఇంట్లోని ఓ గదిలో నిద్రిస్తుండగా హత్యాయత్నం జరిగింది. తన బావ వాకపల్లి సత్యనారాయణ, అతని కుమారులు సుబ్రహ్మణ్యం, ప్రసాద్ లు కిటికీ లోంచి పెట్రోలు పోశారని, అదే సమయంలో కిటికీ వద్ద ఉన్న సైకిల్ టైరు పేలడంతో తమకు మెలకువ వచ్చిందని అప్పారావు చెప్పాడు.
ఈలోగా వారు ముగ్గురు అగ్గిపుల్ల గీసి కిటికీ లోంచి లోపలికి వేసి పారిపోయారన్నాడు. తాము బయటకు రాకుండా గది తలుపునకు బయటి నుంచి గడియ వేశారని, తాము వేసిన కేకలకు ఎదురింటి ముందు టెంట్‌లో నిద్రిస్తున్న వారు వచ్చి రక్షించారని చెప్పాడు. గదిలోని సామగ్రి అంటుకోగా స్థానికులే అదుపు చేశారన్నాడు. గతంలో తమను బెదిరిస్తూ తరచు ఫోన్ కాల్స్ వచ్చేవన్నాడు. ఈ నెల 18న నర్సీపట్నంలో ఉన్న తన భర్తను పై ముగ్గురు గాయపర్చారని మంగారత్నం ఆరోపించింది. చీరలకు ఎంబ్రాయిడరీ చేస్తూ జీవనోపాధి పొందుతున్నామని, ఈ ఘ టనలో చీరలు, ఎంబ్రాయిడరీ సామగ్రి కాలి పో యాయని వాపోయింది. సామర్లకోట పోలీసులు సం ఘటన స్థలాన్ని పరిశీలించారు. అప్పారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications