బాబు, చిరు, కెసిఆర్ ఫోన్ ల ట్యాపింగ్?

శరద్ పవార్, నితీష్ కుమార్ తదితర నేతల ఫోన్ లను ట్యాప్ చేసినట్లు ఓ ఆంగ్ల వారపత్రికలో వార్తాకథనం వచ్చిన నేపథ్యంలో ఆంధ్రజ్యోతి - ఎబిఎన్ చానెల్ ఈ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. రాష్ట్రంలోని ప్రతిపక్ష నాయకుల టెలిఫోన్లు ఇప్పటికీ ట్యాప్ అవుతున్నట్లు ఆ చానెల్ అనుమానాలు వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని సీనియర్ జర్నలిస్టుల ఫోనులను కూడా ట్యాప్ చేస్తున్నట్లు ఆరోపించింది. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతల పోన్ లను ట్యాప్ చేయడం వల్ల లభించిన వివరాల ఆధారంగా దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతివ్యూహాలను రచిస్తూ వచ్చారని విమర్శించింది.












Click it and Unblock the Notifications