నిజామాబాద్ లో డిఎస్ కు నిరసన వేడి

పీసీసీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ ఆదివారం నిజామాబాద్ కు బయలుదేరారు. తెలంగాణలో ఉప ఎన్నికల నేపథ్యంలో తన నియోజకవర్గ కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించనున్నారు. రాజకీయ జేఏసీ పిలుపు మేరకు తెలంగాణ కోసం 12మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. డీఎస్ సొంత నియోజకవర్గం నిజామాబాద్ అర్బన్ లో కూడా ఉప ఎన్నికలు జరుగనున్నాయి. గత ఎన్నికల్లో డీఎస్‌పై గెలుపొందిన బీజేపీ ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.












Click it and Unblock the Notifications