నగరాన్ని వణికిస్తున్న ఈ-కొలి బ్యాక్టీరియా

Hyderabad
హైదరాబాద్: జంటనగరాల్లో మళ్లీ కాలుష్య భూతం కాటేసేందుకు సిద్ధం అవుతోంది. తాగునీటి సరఫరాలో అధికారులు చూపిస్తున్న నిర్లక్ష్యంతో అనేక చోట్ల వ్యాధులు ప్రబలే ప్రమాదం ఏర్పడింది. గత సంవత్సరం భోలక్‌ పూర్‌ లో జరిగిన సంఘటన నగరానికి గుణపాఠం నేర్పింది. అయినా అధికారులు తగిన రీతిలో స్పందించడం లేదు. దీంతో ప్రమాదకరమైన ఈ-కోలి బ్యాక్టీరియా కూడా తాగునీటిలో కనిపిస్తోంది.

ఈ మేరకు ఇన్‌ స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం) ఇచ్చిన నివేదికలు ప్రమాదాల సంకేతాలుగా నిలుస్తున్నాయి. జంటనగరాలకు తాగునీటి సరఫరా, మురుగు నీటి వ్యవస్థను నిర్వహిస్తున్న మెట్రోవాటర్‌ బోర్డు ఆయా ప్రాంతాల్లో నీటి సరఫరాలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతోంది. అయినా కొన్ని ప్రాంతాల్లో సరఫరా అవుతున్న నీటిలో ప్రమాదకరమైన ఈ-కోలి బ్యాక్టీరియా ఉన్నట్టు ఐపీఎం హెచ్చరించింది.

దీంతో వాటర్‌బోర్డు అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. నగరంలోని చాలా ప్రాంతాలు ప్రతి సంవత్సరం వేసవి వచ్చిందంటే కాలుష్యానికి గురవుతున్నాయి. కాలుష్యానికి ప్రధాన కారణం తాగునీటి పైప్‌లైన్‌లు శిథిలావస్థకు చేరుకోవడం, నాలాలకు పక్కనే పైపులుండడం, డ్రైనేజీ లైన్లను ఆనుకొని పైపులను ఏర్పాటుచేయడం, లీకేజీలపై సరైన విధంగా స్పందించకపోవడం, పైపుల్లో నీటి సరఫరా లేకపోవడం వల్ల కూడా కాలుష్యానికి కారణమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+