బాబు వెనక్కి చూసుకోవాలి: రోశయ్య

Rosaiah
హైదరాబాద్: ధరల పెరుగుదలపై ఆందోళన చేస్తామంటున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వారి ప్రభుత్వ హయంలో ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలని ముఖ్యమంత్రి కె. రోశయ్య అన్నారు. అనంతపురం జిల్లాలో ఆయన సోమవారం రెండో రోజు పర్యటన సాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. నిత్యావసర ధరలపై ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన అన్నారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం వల్లనే నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని ఆయన అన్నారు.

తమ కాంగ్రెసు అధిష్టానం సూచనల మేరకే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ఆయన చెప్పారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఎన్ని ఇబ్బందులు వచ్చినా కొనసాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కష్టకాలంలో ప్రజల వద్దకు వెళ్లాలన్నదే ప్రజాపథం ప్రధాన లక్ష్యమని ఆయన చెప్పారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు, లోపాలను సరిదిద్దుకునేందుకు ప్రజాపథం పనికి వస్తుందని ఆయన అన్నారు. ఆర్థిక, మౌలిక సదుపాయాల సమస్యల వల్లనే ట్రిపుల్ ఐటిలో సీట్లు తగ్గించామని ఆయన చెప్పారు. ఆవసరమైన సదుపాయాలను ట్రిపుల్ ఐటిలో కల్పించలేదని ఆయన అన్నారు. అర్హులైన వారందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని, కార్డుల ఏరివేతలో పేదలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+