సోరేన్ కు బిజెపి మద్దతు ఉపసంహరణ

Shibu Soren
న్యూఢిల్లీ: జార్ఖండ్ రాజకీయాలు మళ్లీ రసకందాయంలో పడ్డాయి. జెఎంఎం నేత శిబూ సొరేన్ ప్రభుత్వానికి బిజెపి బుధవారం మద్దతు ఉపసంహరించుకుంది. కోత తీర్మానాలపై జెఎంఎం యుపిఎ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంతో బిజెపి ఆ నిర్ణయం తీసుకుంది. శిబూ సొరేన్ సంకీర్ణ ధర్మానికి విరుద్ధంగా వ్యవహరించారని బిజెపి అధికార ప్రతినిధి ప్రకాష్ జవేదకర్ అన్నారు. జెఎంఎం ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలని బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశం బుధవారం నిర్ణయం తీసుకుంది.

జార్ఖండ్ ఉప ముఖ్యమంత్రి, బిజెపి నాయకుడు రఘువీర్ ప్రసాద్ ఢిల్లీలో ఉన్నారు. ఆయన పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. కాగా, శిబూ సొరేన్ ఇప్పటికే కాంగ్రెసుతో ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెసు, జెఎంఎం కలిసి జార్ఖండ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. కాంగ్రెసుకు ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని అంటున్నారు. సొరేన్ కు కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చి, ఆయన కుమారుడికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేలా అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది.

జెఎంఎం ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటూ బిజెపి బుధవారం సాయంత్రం గవర్నర్ ను కలిసే అవకాశం ఉంది. సొరేన్ కుమారుడికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు కూడా కాంగ్రెసు సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+