చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలోని విత్తనాల గోదాములో బుధవారం తెల్లవారు జామున అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో గోదాము పాక్షికంగా దెబ్బ తిన్నది. దాదాపు 50 లక్షల రూపాయల మేరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగింది.
మంటలు చెలరేగడం గమనించిన స్థానికులు వాటిని ఆర్పేందుకు రంగంలోకి దిగి అదుపులోకి తెచ్చారు. దీంతో భారీ ప్రమాదం తప్పింది. నష్టం అంచనాకు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.