హైదరాబాద్: డాలర్ శేషాద్రికి రాష్ట్ర హైకోర్టు బుధవారం పెద్ద షాక్ ఇచ్చింది. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో డాలర్ శేషాద్రిని విధులకు దూరంగా ఉంచాలని హైకోర్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)ని ఆదేశించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకాధికారిగా శేషాద్రి పదవీ కాలాన్ని పొడిగించడంపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.
శేషాద్రి విషయంలో హైకోర్టు గతంలో టిటిడికి మొట్టికాయలు కూడా వేసింది. శేషాద్రి 2006 నుంచి పొడగింపుపై పదవిలో కొనసాగుతూ వస్తున్నారు. దీన్ని సవాల్ చేస్తూ మందాటి గోపాల్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు.