తెలంగాణ రాకుంటే యుద్ధమే: జయశంకర్

Telangana
హైదరాబాద్: తెలంగాణ రాకుంటే యుద్ధవాతావరణమే నెలకొంటుందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ అన్నారు. తెలంగాణ ప్రజలంతా తెలంగాణను కోరుకుంటున్నారని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, దానికి కేంద్రం కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు. తెరాస పదవ ఆవిర్భావ సదస్సులో ఆయన బుధవారంనాడు ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఫలితం ఎవరికి దక్కాలో వారికే దక్కుతుందని ఆయన అన్నారు.

తెలంగాణ ఉద్యమం విద్యార్థుల చేతుల్లో పదిలంగా ఉందని, కురువృద్ధుల సహాయం లేకుండానే వారు తెలంగాణను సాధించుకుంటారని ఆయన అన్నారు. తెలంగాణ వచ్చే వరకు పోరాటం సాగుతూనే ఉంటుందని ఆయన అన్నారు. ట్రిపుల్ ఐటి సీట్లు తెలంగాణలో అధికంగా ఉన్నాయని, తెలంగాణ విద్యార్థులకు మాత్రం సీట్లు తక్కువగా లభిస్తున్నాయని ఆయన అన్నారు. తెలంగాణలో సీట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టే ట్రిపుల్ ఐటి సీట్లను ప్రభుత్వం తగ్గించిందని ఆయన విమర్శించారు. తెలంగాణ వచ్చే వరకు అన్ని రంగాల్లో తమ వాటాను డిమాండ్ చేస్తూనే ఉంటామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+