జైపూర్: రాజస్థాన్ గవర్నర్ గా శివరాజ్ పాటిల్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజస్థాన్ గవర్నర్ ప్రభారావు మృతి వల్ల ఇప్పటికే పంజాబ్ గవర్నర్ గా ఉన్న పాటిల్ రాజస్థాన్ గవర్నరుగా అదనపు బాధ్యతలు స్వీకరించారు. రాజభవన్ లో సాదాసీదాగా జరిగిన కార్యక్రమంలో రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జగదీష్ భల్లా శివరాజ్ పాటిల్ తో ప్రమాణ స్వీకారం చేయించారు.
ప్రభారావు మృతికి సంతాప సూచకంగా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మంత్రులు, ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు.