ఐటిలో త్వరలో విశాఖ మేటి: రత్నప్రభ

ఐటి కంపెనీలనే కాకుండా ఐటి సంబంధిత యానిమేషన్ వంటి ఇతర కంపెనీలను కూడా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. విశాఖ పరిసర ప్రాంతాలలో విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్ కళాశాలలు అభివృద్ధి చెందుతున్నాయని, స్థానికంగా యువతకు ఉపాధి అవకాశాలలో ప్రాధాన్యత కల్పించాలన్నారు. విశాఖనగరం ప్రత్యేకతలపై దేశ వ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించడం ద్వారా పెద్ద సంస్థలను విశాఖకు తీసుకురావచ్చునన్నారు. అనంతరం విశాఖలో పారిశ్రామిక వేత్తలు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు తెలిపారు. సిఐఐ వైజాగ్ జోన్ చైర్మన్ కెప్టెన్ శ్రీరామ్ రవిచందర్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో సిఐఐ ఆంధ్రప్రదేశ్ వైస్ చైర్మన్ జె.గల్ల, ఐటి విభాగం స్పెషల్ సెక్రటరీ ఎం.గోపికృష్ణ, ఎం.కన్నన్, కె.వి.్భస్కర్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications