అమరవీరుల సాక్షిగా తెలంగాణ సాధిస్తాం: కెసిఆర్

సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కెసిఆర్ తీర్మానాన్ని ప్రతిపాదించారు. బిందు సేద్యానికి సంబంధించిన 34 నెంబర్ జీవోను రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దుమ్ముగూడెం టెయిల్ పాండ్ ప్రాజెక్టును రద్దు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. నిజామాబాద్ లోని లెండి ప్రాజెక్టును, ఆదిలాబాద్ జిల్లాలోని లోయర్ పెన్ గంగ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. యాభై ఏళ్లయినా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడం లేదని ఆయన విమర్శించారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని కూడా ఆయన కోరారు.












Click it and Unblock the Notifications