సొరేన్ తో సంధి ఉండదు: బిజెపి

యుపిఎ ప్రభుత్వానికి మద్దతుగా కోత తీర్మానంపై వోటు వేసినందుకు క్షమాపణలు చెబుతూ సొరేన్ బిజెపి నాయకులు అద్వానీ, సుష్మా స్వరాజ్, గడ్కరీలకు లేఖలు రాశారు. అయినా బిజెపి కరుణించలేదు. అనారోగ్యం కారణంగా కోత తీర్మానానికి వ్యతిరేకంగా తాను ఓటు చేశానని ఆయన చెప్పుకున్నారు.
బిజెపి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తోందనే వార్తలను సుష్మా స్వరాజ్ ఖండించారు. బిజెపి నాయకుడు ముఖ్యమంత్రిగా, శిబూ సొరేన్ కుమారుడు హేమంత్ ఉప ముఖ్యమంత్రిగా బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లో నిజం లేదని సుష్మా స్వరాజ్ అన్నారు.












Click it and Unblock the Notifications