టెర్రరిస్టు కసబ్ కు ఉరిశిక్ష ఖరారు

నరరూప రాక్షసుడి అవతారమెత్తి అమాయకులను పొట్టనపెట్టుకున్న కసబ్ భవిష్యత్‌లో మారతాడన్న నమ్మకం తనకు ఏమాత్రం లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ కిరాతకుడికి మరణ దండన కాకుండా మరే శిక్ష విధించిన న్యాయవ్యవస్థపై సామాన్యుడికి నమ్మకం పోతుందన్నారు. ముంబై మారణహోమం మాటల్లో వర్ణించలేని ఘోరకృత్యమని అన్నారు.
తహిల్యాని తీర్పును హిందీలో చదివి కసబ్‌కు వినిపించారు. తీర్పు వింటూనే కసబ్ కంటతడి పెట్టాడు. తనకు గ్లాసు మంచినీళ్లు కావాలని అడిగాడు. ఇంకా ఏమైనా కావాలా? అని అడగ్గా దిగ్భ్రాంతికి గురయినట్టుగా ముఖంపెట్టాడు. తర్వాత అతడిని పోలీసులు కోర్టు నుంచి జైలుకు తరలించారు. మరోవైపు కసబ్‌కు మరణశిక్ష విధించడంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications