హైదరాబాద్: వైద్య, విద్యారంగాలు వ్యాపారంగా మారడం దురదృష్టకరమని ముఖ్యమంత్రి కె. రోశయ్య అన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలు వ్యాపార దృక్పథంతోనే పని చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. విద్యా సంస్థలు వింత పోకడలు పోతున్నాయని, అయినా తల్లిదండ్రులు కూడా కార్పొరేట్ విద్యాసంస్థల పట్లనే ఆసక్తి చూపుతున్నారని ఆయన అన్నారు.
హైదరాబాదులోని భద్రుకా కళాశాలలో ఏర్పాటైన జాతీయ సదస్సులో ఆయన శనివారం ప్రసంగించారు. విద్య, వైద్య రంగాల్లో విలువ పరిరక్షణ అవసరమని ఆయన అన్నారు. నాణ్యమైన విద్యను అందించడానికి విద్యా సంస్థలు కృషి చేయాలని ఆయన అన్నారు.