వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా పని అయి పోలేదు: చిరంజీవి

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
కాకినాడ: తమ పార్టీ పని అయిపోలేదని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. ఇది ఎన్నికల సమయం కాదని, తాను ఓట్ల కోసం రాలేదని ఆయన అన్నారు. ప్రజారాజ్యం పార్టీ పని అయిపోయిందంటూ కొంతమంది దుష్ప్రచారం సాగిస్తూ తనను ప్రజల నుంచి దూరం చేయాలని చూస్తున్నారని, అది జరిగే పనికాదని ఆయన అన్నారు. తనకు ప్రజలంతా అండగా నిలిస్తే వారి కోసం తాను పోరాటం సాగిస్తానని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించేందుకు చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా ఆయన శుక్రవారం అన్నవరం, బెండపూడి, రావికంపాడు, ఎ.వి. నగరం,పెరుమాళ్ళపురం, ఒంటిమామిడి, తొండంగి, హంసవరం, వల్లూరు, ఎస్.అన్నవరం మీదుగా తుని వరకూ పర్యటన కొనసాగించారు.

తాగడానికి నీళ్లు, పండించుకోవడానికి భూమిలేకుండా చేస్తే ప్రజలకడుపు మండి తిరగబడే రోజొస్తుందని ఆయన హెచ్చరించారు. అంతవరకూ తెచ్చుకోకుండా తక్షణమే బహుళార్ధ సాధక ప్రాజెక్టు అయిన పోలవరానికి జాతీయ హోదా కల్పించాలని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ప్రస్తుతం డెల్టాలో రెండోపంటకు నీరిచ్చేస్థితిలేదన్నారు. కొన్నాళ్ళు పోతే ఒక్కపంటక్కూడా నీరివ్వల్వేని పరిస్థితి దాపురిస్తుందని ఎద్దేవా చేశారు.

తమిళనాడు పార్లమెంటు సభ్యులకు ఉన్న చిత్తశుద్ధి, కార్యదక్షత మన ఎంపీలకు లేకుండా పోయిందని ఆయన అన్నారు. వాళ్ళు పోరాడి సాధిస్తుంటే వీళ్ళు అనైక్యతతో చేతకాని వారవుతున్నారని విమర్శించారు. పారిశ్రామికాభివృద్ధి అవసరమేగానీ పసిడిపండే పచ్చని భూముల్లో కాకుండా పోరంబోకు, బంజరు భూముల్లో ఏర్పాటు చేస్తే ఎవరికీ అభ్యంత రం లేదన్నారు.

పెట్రోకారిడార్ పేరుతో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఇక్కడి భూములు, సముద్రాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. ఇదేగనుక జరిగితే ఈప్రాంతమంతా కాలుష్యంతో నిండి చేపలు దొరకని స్థితి ఎదురవుతుందని అన్నారు. గంగపుత్రులు,భూమి పుత్రుల వెన్నంటే ఉంటానని, ప్రజలూ తనకు అండగా నిలవాలని కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X