ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ను చంపుతామంటూ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. పోలీసు కంట్రోల్ రూంకు ఆగంతకుడు ఒకతను ఫోన్ చేసి షీలా దీక్షిత్ ను చంపుతామని బెదిరించాడు. ఈ ఫోన్ కాల్ గురువారం రాత్రి వచ్చింది. షీలా దీక్షిత్ కు వచ్చే 72 గంటల పాటు ప్రాణాపాయం ఉందని ఫోన్ కాల్ వచ్చింది.
బెదిరింపు ఫోన్ కాల్ నేపథ్యంలో షీలా దీక్షిత్ కు భద్రతను పెంచారు. ఆమె ఇంటి వద్ద కూడా భద్రతను పెంచారు. ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని కనిపెట్టడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీలో తనిఖీలు పెంచారు.