లక్నో: తన లోకసభ స్థానం అమేథీలో కాంగ్రెసు నేత రాహుల్ గాంధీ మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తో కలిసి పర్యటించారు. మంగళవారంనాడు బిల్ గేట్స్ రాహుల్ తో కలిసి అమేథీకి వచ్చారు. అమేథీని ఐటి హబ్ గా అభివృద్ధి చేస్తానని బిల్ గేట్స్ హామీ ఇచ్చారు. విమానాశ్రయంలో దిగిన తర్వాత రాహుల్ తో కలిసి బిల్ గేట్స్ జైస్ పట్టణంలోని బహదూర్ పూర్ గ్రామానికి వెళ్లారు. అక్కడ రాజీవ్ గాంధీ మహిళా వికాస యోజన సభ్యులతో ఆయన మాట్లాడారు.
బిల్ గేట్స్ ఈ సందర్భంగా కంప్యూటర్ విద్య ప్రాధాన్యాన్ని వివరించారు. అమేథీతో పాటు సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలీని ఐటి హబ్ లుగా తీర్చిదిద్దడానికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.