అమ్మవారి చీరల వేలం, బిజెపి నిరసన

ఈ వేలం పాట కోటి రూపాయలపైనే జరుగుతోంది. ఆలయ ఈవో విజయకుమార్ చీరలను వేలంపాట ద్వా రా కాంట్రాక్టర్‌కు ఇచ్చేందుకు ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకున్నట్లు, వేలంపాటలో కాంట్రాక్ట్ దక్కించుకున్న వారికి జూన్ ఒకటో తేదీ నుంచి 2011 మార్చి 31వ తేదీ వరకు అనుమతి ఉంటుందని ఈవో తెలిపారు.
మరో వైపు వేలానికి వ్యతిరేకంగా దుర్గ గుడి ముందు బీజేపీ ధర్నా నిర్వహించింది. పోలీసులు జోక్యం చేసుకుని వారిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నగర బిజేపీ అధ్యక్షుడు వెంకటపిచ్చయ్య మాట్లాడుతూ కనకదుర్గమ్మకు భక్తులు సమర్పించే చీరలను ఆలయ ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించాలని, అందుకు విరుద్ధంగా కాంట్రాక్ట్ ఇవ్వడానికి వేలం నిర్వహించడంవల్లభక్తుల మనోభావాలు దెబ్బతింటాయన్నారు.












Click it and Unblock the Notifications