హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిచ్చు చిదంబరానిదే: టిడిపి సీమాంధ్ర నేతలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Yerran Naidu
హైదరాబాద్: రాష్ట్ర విభజన చిచ్చు కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం పెట్టిందేని తెలుగుదేశం సీమాంధ్ర నేతలు శ్రీకృష్ణ కమిటీతో చెప్పారు. రాష్ట్ర విభజన విషయంలో టీడీపీలో ఎందుకు ఏకాభిప్రాయం రావడం లేదని శ్రీకృష్ణ కమిటీ ప్రశ్నించింది. సోమవారం సాయంత్రం ఇక్కడ ఈ కమిటీని సీమాంధ్ర ప్రాంత టీడీపీ నేతలు కలిసి సమైక్యాంధ్రపై తమ వాదనలు వినిపించినప్పుడు ఈ ప్రశ్న ఎదురైంది. 'కాంగ్రెస్‌ కూ, మాకూ ఈ సమస్య ఉందని హోంమంత్రి చిదంబరం ప్రకటన వల్లే ఈ సమస్య ఏర్పడిందని, పార్టీలు ప్రాంతాలవారీంా విడిపోయాయని యనమల రామకృష్ణుడు సమాధానమిచ్చారు. రాష్ట్రంలోని రెండు ప్రాంతాలూ రెండు కళ్లని పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటన కూడా ప్రస్తావనకు వచ్చింది. రెండేనా, మూడు కాదా? అని ఒక సభ్యుడు ఛలోక్తి విసిరారు.

చంద్రబాబును అంటున్నారు, సోనియా ఎందుకు మాట్లాడరని, ఆమె మౌనంగా ఉండి రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో పార్టీని కాపాడుకోవచ్చు గానీ మేం కాపాడుకోకూడదా అని, మూడు ప్రాంతాలూ మాకు మూడు కళ్లు' అని యనమల బదులిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటయ్యాక తెలంగాణ ప్రాంతంలో జరిగిన అభివృద్ది గురించి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గణాంకాలతో సహా వివరించారు. ఈ సమాచారాన్ని తెలంగాణ ప్రాంత ప్రజలకు వివరిస్తే వారిలో ఉన్న అపోహలు తొలగే అవకాశం ఉంది కదా అని కమిటీ సభ్య కార్యదర్శి దుగ్గల్ ప్రశ్నించారు. 'వాస్తవాలు తెలిసీ మాట్లాడే వారికి ఏం చెప్పగలుగుతాం' అని ఉమ్మారెడ్డి అన్నారు.

టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇస్తూ - అందులో పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ మంత్రి హోదాలో శాసనమండలిలో చేసిన ఒక ప్రకటనను ప్రస్తావించారు. సచివాలయంలో తెలంగాణకు చెందినవారు నాలుగైదు శాతానికి మించి లేరని కేసీఆర్ పదేపదే చెబుతున్నారని, కానీ, సచివాలయంలో తెలంగాణ ప్రాంతంవారు 53% ఉన్నారని, మిగిలిన వారిలో ఇతర ప్రాంతాలవారు, ఇతర రాష్ట్రాల వారు ఉన్నారని డీఎస్ ఓ ప్రకటనలో చెప్పారని సోమిరెడ్డి వివరించారు. శ్రీకృష్ణ కమిటీతో భేటీ చాలా సంతృప్తినిచ్చిందని సీమాంధ్ర టీడీపీ నేతలు తెలిపారు. నీటి పారుదలపై కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడు, వ్యవసాయంపై ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మౌలిక సదుపాయాల కల్పనపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి తమ వాదనలు వినిపించారు. తెలుగువారందరినీ సాటిలేని వారిగా తీర్చిదిద్దాలంటే సమైక్యాంధ్రతోనే సాధ్యమన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X