పవన్ కళ్యాణ్ మూవీ చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ.. ఆపరేషన్ సక్సెస్ !!

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... హీరోలకు ఫ్యాన్స్ ఉండడం సహజమే కానీ పవన్ కళ్యాణ్‌కు ఫ్యాన్స్ మాత్రమే కాదు, హీరోల్లోనే అభిమానులు ఉంటారు. ఆయన సినిమాలకు హిట్, ఫ్లాప్ లతో సంబంధం ఉండదంటే అతిశయోక్తి కాదు. ఒక వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. మరోవైపు తాను కమిట్ అయిన సినిమాలను ఫినిష్ చేసేశారు. ఈ ఏడాది వరుసగా రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్.. "హరిహర వీరమల్లు" చిత్రంతో నిరాశపరిస్తే.. "ఓజీ" మూవీతో భారీ హిట్ ఖాతాలో వేసుకున్నారు.

కాగా ఇటీవలే పవన్ "ఉస్తాద్ భగత్ సింగ్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. రాక్ స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. గతంలో హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేయగా.. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.

brain-surgery-to-women-at-prakasam-district-while-showing-pawan-kalyans-movie-og-and-operation-succ

ఇప్పుడు లేటెస్ట్ గా ప్రకాశం జిల్లాలో ఓ ఆసక్తిగా సంఘటన చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా దర్శి ప్రాంతానికి చెందిన కోటేశ్వరమ్మ బ్రెయిన్ కు సంబందించిన శస్త్రచికిత్స జరిగింది. బ్రెయిన్ సర్జరీ కావడంతో వైద్యులు ఆమెకు మత్తు ఇవ్వకుండా.. శరీరంలో కదలికలు గుర్తించాలని ఓ ఉపాయం ఆలోచించారు. కోటేశ్వరమ్మకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం.. ఈ విషయాన్ని తెలుసుకున్న వైద్యులు ఆమెకు ఓజీ సినిమా చూపిస్తూ సర్జరీ చేయడం గమనార్హం.

అయితే కోటేశ్వరమ్మ గత కొంతకాలంగా తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆమెకు అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో ఆమెను హాస్పటల్ కు తీసుకెళ్లారు కుటుంబసభ్యులు. వైద్యపరీక్షలు చేసిన అనంతరం ఆమె మెదడులో ఓ గడ్డను గుర్తించారు వైద్యులు. దాంతో ఆపరేషన్ థియేటర్‌లోనే ల్యాప్ టాప్ లో 'ఓజీ' మూవీ చూపించి సర్జరీ చేసినట్టు స్పష్టం చేశారు. ప్రస్తుతం కోటేశ్వరమ్మ ఆరోగ్యం స్థిరంగా ఉందని, ఆమె వేగంగా కోలుకుంటున్నారని తెలిపారు. గతంలో సైతం ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+